Breaking News: Global markets react to new economic reforms
కూకట్పల్లి,ఏప్రిల్ 02 2026 : హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణం, గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.స్వామివారికి పుష్పాలంకరణలతో పాటు విశేషంగా అలంకరించారు. కొందరు భక్తులు తులసి మాలలు,తమల ఆకులతో కూడా అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు.కూకట్పల్లి లోని భాజరంగ్దళ్ దేవాలయం లో లక్షఆకుల పూజ చేసారు.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ,కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ప్రత్యేక పూజలు చేసారు.వివేకానందనగర్ లోని శ్రీ రామాలయం లో భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి లక్ష వడమాల వేశారు.అనంతంరం భక్తులు దర్శనం చేసుకున్నారు.పూజల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.కేపీహెచ్బి లోని రామసేన కల్చరల్ అసోసియేషన్ రెండవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.రమ్య మైదానం నుంచి బయలుదేరిన రామసేన హిందూ బంధువులు పాల్గొన్నారు.రోడ్ నంబర్ 2ఆంజనేయ స్వామి లోని గుడి వద్ద విజయోత్సవ ర్యాలీ ముసిగింది.కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో RR విద్య భావం స్కూల్ విద్యార్థులు హనుమాన్ చాలీసా పటించారు.జగద్గిరిగుట్ట లోని సాలాసార్ హనుమాన్ దేవాలయం నుంచి హిందూ బంధువులు జై శ్రీ రామ్ అంటూ భారీ విజయోత్సవ ర్యాలీ పాల్గొన్నారు.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
హనుమాన్ జయంతి సందర్బంగా కూకట్పల్లి దీనబంధు కాలనీ లోని శివాజీ స్టాట్యూ నుండి యువకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వందలాది యువకులు పాల్గొన్నారు.వివేకానందనగర్ డివిజన్ కలం ప్రసన్న నగర్ లో హనుమాన్ జయంతి సందర్బంగా టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జశ్వంత్ పానకం పులిహోర పంపిణి కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,మరియు టీఆరెస్వి రాష్ట్ర నాయకులూ మాచర్ల భద్రయ్య పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు విజయోత్సవ ర్యాలీలు






తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక బహుజన చక్రవర్తి - 316 వ వర్ధంతి












టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 02 2026 : ఈరోజు భువనగిరి విద్యుత్తు సర్కిల్ ఆఫీసు ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు 1104, 27, టిఆర్వికెఎస్,బి సి అసోసియేషన్,ఎస్సీఎస్టీ అసోసియేషన్ సంఘాలు మద్దతు తెలుపుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని మిగిలిపోయిన అన్మాండ్ కార్మికులు మరియు సొసైటీ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించాలని రేటు కార్మికులు ప్రవేట్ కలెక్షన్ ఏజెంట్లు,ప్రైవేట్ మీటర్ రీడర్లు,ఎస్పీఎం కార్మికులు,హమాలీలు కార్మికులకు జీవో నెంబర్ 11ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని అలాగే 2026 పిఆర్సి కమిటీని వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిజిఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్ బొక్క పాండరీ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చైర్మన్ భాస్కర్ నాయక్, భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కో చైర్మన్ ఎడ్ల వెంకటేశు, కన్వీనర్ బోట్ల రమేష్,కో కన్వీనర్ హరికృష్ణ,సాగిన రమేష్, భువనగిరి సబ్ డివిజన్, బింగి శ్రీకాంత్ గౌడ్ దాతరపు భాస్కర్, వైస్ చైర్మన్ బొట్ల నర్సింగరావు, బండ రవి, కోశాధికారి హేమలత,మహిళ ప్రతినిధి మహేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శి అమరేందర్, ఈదయ్య,బాలకృష్ణ సంయుక్త కార్యదర్శి భాస్కర్, శోభన్ బాబు, మల్లేష్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.












టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 02 2026 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక.సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.పాపన్న జయంతి సందర్భంగా ఆయన వీరగాథను స్మరించుకుంటూ ఆనాటి నిరంకుశ రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పోరాడిన ఆయన ధైర్య నాయకత్వం అపూర్వం.ఆయన పోరాటం సమానత్వం స్వాభిమానం కోసం జరిగిన మహత్తర ఉద్యమంగా గుర్తించబడుతుంది.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 3016వ వర్ధంతి సందర్బంగా కూకట్పల్లి లో బండి రమేష్,అల్విన్ కాలనీ లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ,శేరిలింగంపల్లి లో జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ అద్వర్యం లో వంట వార్పు



కూకట్పల్లి రామాలయం లో ఘనంగా
రధోత్సవం








టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 02 2026 : కూకట్పల్లి రామాలయం లో గురువారం సాయంత్రం రధోత్సవం నిర్వహించారు గ్రామస్థులు.సీతారాముల వారికీ గ్రామం లోని నివాసితులు హారతులు,కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.సాంస్కృతిక నృత్యాలు చేసారు.డప్పులు మేళతాళాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.