కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 04 2026 : జిహెచ్ఎంసి నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిజాంపేట సర్కిల్ పరిధిలోని కాలనీలలో జరుగుతూవున్న అభివృద్ధి స్థానిక సమస్యల పై మధుర నగర్ లో పాదయాత్ర చేసి అధికారులతో సమీక్షా సమావేశానిర్వహించారు.రోధల్ నిర్మాణం,మరమ్మతులు,పారిశుధ్య నిర్వహణ ఇతర మౌలిక వసతుల కల్పనపై కాలనీ వాసులు తెలిపారు.గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచామని, రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉప కమిషనర్ సాబేర్ అలీ, ఇంజనీరింగ్ ఏఈ ప్రవీణ్ కుమార్, ఎస్.డబ్ల్యూ.ఎం శరన్ తేజ, నిజాంపేట్ సర్కిల్ కు చెందిన వివిధ విభాగాల అధికారులు మరియు స్థానిక కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం - బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

ప్రజా పాలన ప్రగతి పాలన లో 30వ రోజు డ్రైవ్ " క్లీనింగ్ పార్క్"

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : కేపిహెచ్బి డివిజన్ లో గల పీవీ నరసింహారావు పార్కులో పిల్లల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులకు సంబంధించి పనులను పరిశీలించారు.పార్క్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు ఆదేశించారు.ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఒకగంట వ్యాయామానికి కేటాయించాలన్నారు.పిల్లలకు క్రీడల పట్ల అవగానే కలిగించి మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని కాపాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు,ఈ కార్యక్రమంలో ఏఈ రాజీవ్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 :ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 30వ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని జీడిమెట్ల సర్కల్ లోని శుభ్రపరచడం మరియు క్లీన్ చేయడం కోసం పార్కులను గుర్తించడం లో భాగంగా డాక్టర్ జి. శ్రీజన, ఐఏఎస్ గారు కమిషనర్ , సైబరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ మీనాక్షి ఎస్టేట్ కాలనీ పార్క్ ను సందర్శించారు.పార్కులో వాల్కర్స్ తో మాట్లాడారు.త్వరలోనే కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తామన్నారు.

పీవీ నరసింహారావు పార్కులో పిల్లల ఆట వస్తువులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు

3,94,000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : ముఖ్య మంత్రి సహాయ నిధిని కూకట్పల్లి ఇంచార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అందజేశారు.కూకట్పల్లి లోని వివిధ డివిజన్ లకు చెందిన వారికి 3,94,000/- రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బండి రమేష్ కు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గాలి బాలాజీ, పుష్ప రెడ్డి, కొప్పిశెట్టి దినేష్ కుమార్,గంధం రాజు,పులి శివకుమార్ గౌడ్ ,గోపాల్ చౌదరి, రంగమోహన్ ,అక్బర్ ,ప్రసన్నకుమార్, మధు, మహేందర్, కలికోట బాలరాజు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

బాలికల ఆరోగ్యమే – దేశానికి భవిష్యత్తుకు బలమయిన పునాది - కోలన్ హన్మంత్ రెడ్డి

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆవిష్కరించారు.9 నుంచి 14 ఏళ్ళుగా గర్భాశయం లో ఉన్న హెచ్పివి వాక్సిన్ కేన్సర్ ను నివారించడం బాలికలు ఆరోగ్యామీ దేశ భవిష్యత్తుకు బలమయిన పునాది అని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

సేవలోనే కాదు, నిజాయితీలోనూ ముందంజలో 108 సిబ్బంది

నమ్మకానికి నిదర్శనంబాధితుడి నగదు, బంగారం అప్పగింత

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి శనివారం సుచిత్ర నుండి మేడ్చల్ వెళ్లే దారిలో ప్రయాణిస్తుండగా జీడిమెట్ల విలేజ్ సమీపంలోని గాంధీ స్టాచ్యూ వద్ద తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.​సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ ఈ.ఎం.టి (ఈఎంటి)రాజు మరియు పైలట్ నవీన్ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.బాధితుడి వద్ద ఉన్న ఒక బంగారు గొలుసు,వెండి బ్రాస్‌లైట్,రెండు మొబైల్ ఫోన్లు మరియు సుమారు ₹2 లక్షల రూపాయల నగదును అంబులెన్స్ సిబ్బంది భద్రపరిచారు.ఆసుపత్రికి చేరుకున్న తర్వాత బాధితుడి స్నేహితులను పిలిపించి వారి సమక్షంలో ఆ నగదు మరియు వస్తువులను అప్పగించారు.​క్లిష్ట సమయంలో ప్రాణాలు కాపాడటమే కాకుండా లక్షల రూపాయల విలువైన వస్తువులను తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్న పైలట్ నవీన్ మరియు ఈఎంటి రాజులను బాధితుడి స్నేహితులు మరియు స్థానికులు అభినందించారు.

Contact:

todaytimesnews1@gmail.com

+91 9700597750

© 2026 All rights reserved - todaytimesnews.in

TodayTimesnews.in