Breaking News: Global markets react to new economic reforms
కూకట్పల్లి, మార్చ్ 27 శ్రీ రామ నవమి సందర్బంగా కూకట్పల్లి లోని నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం లో సీతారామచంద్ర స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు,మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ,మాజీ కార్పొరేటర్ రోజాదేవి రంగారావు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు.కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు అనంతరం అన్న సంతర్పణలో భక్తులు ప్రసాదం స్వీకరించారు.కూకట్ పల్లి లోని శివయ్య గారి నగర్ లో సీత రాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది భక్తులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రామాలయం లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.శివయ్య గారి నగర్ లో జరిగిన సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది.ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు,మాధవరం రామారావు కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ కాలని,పాపిరెడ్డి నగర్,పాపారాయుడు నగర్ దేవాలయాలలో ఎమ్మెల్యే ఆర్తీకపూడి గాంధీ,కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ జగద్గిరిగుట్ట సిఐ వెంకటేశం తమ సిబ్బంది తో బందోబస్తు నిర్వహించి పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.











































శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూకట్ పల్లి లోని పలు దేవాలయాలలో జరిగిన రాముల వారి కల్యాణానికి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు.ఫతేనగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు మరియు బస్తీల దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు అన్నదాన సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్.




హైదర్ నగర్, మార్చ్ 27, 2026:
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు గారు పలు ఆలయాలను, శ్రీరామనవమి పందిర్లను, సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కాలనీల్లోని రామాలయాలను సందర్శించి. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. అలానే, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయాల వద్ద భక్తులకు మంచినీరు, పంపిణీ వంటి ఏర్పాట్లను మాజీ కార్పొరేటర్ స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం రాముడు చూపిన ధర్మమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, డివిజన్ ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో సమీప కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాలను మారుమోగించారు.


మెగా పవర్ స్టార్ రాంచరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి,ప్రేమ కుమార్
ఈ రోజు మెగా అభిమానులు సందీప్ దానపాల్,అరవింద్,చెర్రీ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బాలానగర్ లోని మైత్రీ విమల్ థియేటర్ లో జరిగిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక రక్తదానం ద్వారా 3 మంది ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది.తలసేమియా,ప్రమాదాలు,శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం అని రక్తదానం చేస్తున యువతను నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భోగాది వెంకటేశ్వర రావు, కొల్లా శంకర్, గడ్డం కిషోర్ నాగరాజు, పులగం సుబ్బు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


శ్రీరామ నవమి సందర్భంగా కాకాగూడ వార్డ్ నెంబర్ 5 కంటోన్మెంట్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్


కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి
కూకట్‌పల్లి కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో గురువారం ఘనంగా ముగిశాయి. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో కోర్టు ప్రాంగణం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించింది. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం పోటీ ద్వారా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా కె. సురేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి. సత్యనారాయణ, కె. శ్రీదేవి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా శివ ప్రసాద్ గౌడ్, కోశాధికారిగా కె. గోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. క్రీడా కార్యదర్శిగా ఎన్. రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా వి. శ్రీలత ఎన్నికయ్యారు. మహిళా ప్రతినిధిగా చి. ప్రత్యూష ఎన్నికయ్యారు. అదనంగా కార్యవర్గ సభ్యులుగా సోను మిత్తల్, ఎస్. ధనలక్ష్మి, శ్రీకాంత్ టి, నవీన్ కుమార్ ఎం, సందీప్ రెడ్డి ఎస్, కల్యాణి జి, వి. అరవింద్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం క్రమబద్ధంగా, పారదర్శకంగా సాగినట్లు న్యాయవాదులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు న్యాయవాదులు అభినందనలు తెలియజేస్తూ, వారి పదవీకాలంలో బార్ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం, వృత్తి గౌరవం పెంపొందించే దిశగా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.




కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎల్గని శివ ప్రసాద్ గౌడ్
కూకట్‌పల్లి కోర్టు ప్రాంగణంలో గురువారం (మార్చి 26న) నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎల్గని శివ ప్రసాద్ గౌడ్ జాయింట్ సెక్రటరీగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి పదవిని కైవసం చేసుకున్నారు.విజయం అనంతరం తోటి న్యాయవాదులు శివ ప్రసాద్ గౌడ్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శివ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన ప్రతి న్యాయవాదికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.న్యాయవాదులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ నా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తా అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, మిత్రులు మరియు అభిమానులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.




మీకు మరియు మీ కుటుంబానికి పవిత్రమైన రామ నవమి శుభాకాంక్షలు! శ్రీరాముని సత్యం, ధైర్యం, కరుణ మరియు భక్తి వంటి సద్గుణాలు మనందరికీ ధర్మబద్ధమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి స్ఫూర్తినివ్వాలి . ఈ రోజు మీ హృదయానికి ఆనందాన్ని, మీ మనస్సుకు స్పష్టతను మరియు మీ ఆత్మకు బలాన్ని ప్రసాదించుగాక.


శ్రీరామ్ నవమిల వారి కళ్యాణం బోనగిరి మండలం బాలంపల్లి సర్పంచ్ కాసేపాక శ్రీరామ్