ప్రగతి డిగ్రీ మహిళా కళాశాలో బయో స్కోప్ 2026

కూకట్పల్లి, మార్చ్ 30, 2026 : వివేకానందనగర్ లోని ప్రగతి డిగ్రీ మహిళా కళాశాలో విద్యార్థులు బయో స్కోప్ 2026 పేరిట మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు గాజులరామారం లోని సత్య గౌరీ కన్వెన్షన్ హాల్ లో జరిగాయి.ఈ సందర్బంగా డైరెక్టర్ రవీంద్ర రావు మాట్లాడుతూ విద్యార్థులు అభివృధే ధ్యేయంగా వసతులు కల్పిస్తున్నామని తెలిపారు,ప్రిన్సిపాల్ అనిరాధా శాస్త్రి మాట్లాడుతూ చదువును నిర్లక్ష్యం చేయవద్దన్నారు.డిగ్రీ ఫైనల్ ఇయర్ లోని ప్రతి గ్రూప్ నుంచి బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందజేశారు.అనంతరం విద్యార్థులు డీజే పాటలకు నృత్యాలు రీమిక్స్ డ్యాన్సులు మిస్ ప్రగతి అందరిని ఆకట్టుకున్నాయి

 

టుడే టైమ్స్ న్యూస్, మార్చ్ 30 2026 : సికింద్రాబాద్ నుంచి వచ్చిన బ్యాంక్ డబ్బుల రవాణా వాహనం కూకట్పల్లి ఉషముళ్ళపూడి కాలమాన్ వద్ద మలుపు లో ఒక్క సరిగా టైర్ రద్దు విరిగి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది.అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ క్రేన్ ను తెప్పించి వాహనాన్ని పక్కకు జరిపారు.దాదాపు అరగంట సేపు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

టైరు రాడ్డు విరిగి రోడ్డు మధ్యలో నిలిచిన బ్యాంకు వాహనం

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 01 2026 : కూకట్పల్లి లో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అద్వర్యంలో కూకట్పల్లి లో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు.వేద పండితులచే వేదమంత్రోచ్చారణాల మధ్య మహా లక్ష్మి ని స్మరిస్తూ యాగం నిర్వహించారు.సాంప్రదాయ దుస్తుల్లో ఈ యాగం లో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.కూకట్పల్లి లోని వివేకానందనగర్ డివిజన్ లో గల్ అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామి జన్మదినొత్వం సందర్బంగా కలశాల పూజ నిర్వహించారు అర్చకులు.పూజ అనంతరం దేవాలయ ప్రాంగణం లో అన్న ప్రసాదం అందించారు.ఈ కార్యక్రమం లో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కూకట్పల్లి లో ఆధ్యాత్మిక పండగ వాతావరణం

వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆదివారం లో వేదమంత్రోచ్చారణాల మధ్య మహా లక్ష్మి యాగం

అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం అయ్యప్ప నామాలతో మారుమ్రోగిన అయ్యప్ప దేవాలయాలు

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 01 2026 : శ్రీ ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఉత్తరా జన్మ నక్షత్రం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మారమ్మా దేవస్థానంలో జిల్లా వెంకటేష్ గారు మరియు వారి బృదాం వారు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపోజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు.ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శివాలయం దేవస్థానంలో ఉన్న అయ్యప్ప స్వామి వారికి ఫతేనగర్ గురు స్వాములతో కలిసి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్.

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 01 2026 : శ్రీ ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఉత్తరా జన్మ నక్షత్రం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మారమ్మా దేవస్థానంలో జిల్లా వెంకటేష్ గారు మరియు వారి బృదాం వారు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపోజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు.ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శివాలయం దేవస్థానంలో ఉన్న అయ్యప్ప స్వామి వారికి ఫతేనగర్ గురు స్వాములతో కలిసి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్.

టుడే టైమ్స్ న్యూస్, మార్చ్ 30 2026 : మూసాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సేవే శ్వాసగా ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడు మూసాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సత్యం-సేవ-సంకల్పంతో ప్రజల కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుడు మీకు ఆయుష్షు, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

తూము శ్రవణ్ కుమార్ కు శుభాకాంక్షలు

టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 30 2026 : సంక్షేమ సంఘాలు,అసోసియేషన్లు బస్తీ సమస్యల పరిష్కారంలో ముందుండాలని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సూచించారు.ఆదివారం జరిగిన పర్వత నగర్ సంక్షేమ సంఘం ఎన్నికల్లో పార్టీకి చెందిన రాజారావు వర్గం విజయం సాధించింది.ఈ అసోసియేషన్ సభ్యులు మంగళవారం బండి రమేష్ ని కూకట్పల్లిలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బండి రమేష్ వారిని అభినందించారు. పర్వత నగర్ లో నెలకొన్న సమస్యలను అసోసియేషన్ సభ్యులు ఆయన దృష్టికి తీసుకురాగా తీసుకువచ్చారు కాలనీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు దీనిపై బండి రమేష్ స్పందిస్తూ బస్తీ తోపాటు నియోజకవర్గం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజరావ్ యాదవ్ ,వాసు, నరేష్, భర్కత్ అలి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ సంఘాలు,అసోసియేషన్లు బస్తీ సమస్యల పరిష్కారంలో ముందుండాలి టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్

మల్లంపేటలో సౌచాలయాలు మూత

టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 30 2026 : మల్లంపేట లోని బస్ స్టాప్ లో ప్రయాణికుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి సౌచాలయలు నిర్మించారు కానీ వాటిని ఉపయోగించుకునే లా లేకపోవడం తో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సౌచాలయలకు తాళం వేసి ఉంచారు.మున్సిపల్ అధికారులు తాళాలు తీసి ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రక్తదానమే ప్రాణదానం : మాచన రఘునందన్

టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 30 2026 : రక్తదానానికి మించిన శుభకార్యం మరొకటి లేదని, రక్తదాతలు నిజమైన ప్రాణదాతలని టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు.బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఆయన స్వయంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ, రక్తదానం చేసిన తర్వాత “ఓ మంచి పని చేశాను” అనే ఆత్మసంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3–4 సార్లు రక్తదానం చేయాలని సూచించారు.తాను ఇప్పటివరకు 69 సార్లు రక్తదానం చేసినట్లు వెల్లడించారు. ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు లేదా ప్రత్యేక సందర్భాల్లో రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Contact:

todaytimesnews1@gmail.com

+91 9700597750

© 2026 All rights reserved - todaytimesnews.in

TodayTimesnews.in