Breaking News: Global markets react to new economic reforms
జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు - దేశ ప్రగతిలో సర్పంచుల భాగస్వామ్యం వెలకట్టలేనిది


జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని నూతన గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన సర్పంచుల సమస్యల పరిష్కారానికి వారి హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వివేరా హోటల్లో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు జిల్లా గ్రామ సర్పంచులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ... గాంధీజీ కలని కన్నా స్వరాజ్యం సాధించడానికి గ్రామ పౌరులు సర్పంచుల ద్వారానే సాధ్యమవుతుందని ఆనాడే మహాత్మా గాంధీ బోధించారని అన్నారు.
నేడు వారి ఆశయ సాధనకు పాటుపడుతున్న సర్పంచ్లకు అనేక సమస్యలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని గ్రామాలకు ఎన్నికైన సర్పంచులు గ్రామంలోని ప్రజా సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి 24 గంటలు కృషి చేస్తున్న సర్పంచుల వేతనాలను 6500 నుండి 25 వేల వరకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు పాటు గ్రామాలలోని సొంత గ్రామ పనులు నిధులను కూడా ఫ్రిజ్ చేయడం సరికాదని అన్నారు. వెంటనే ఫ్రీజ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.
గ్రామ సర్పంచులు ప్రజాసేవలో మంచి గుర్తింపు తీసుకొచ్చి గ్రామాలకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ సమక్షంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా కొప్పుల వెంకటరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా టేకు మంజుల, ప్రధాన కార్యదర్శిగా గిరి కంటి నిరంజన్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి, జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్, కార్యదర్శిగా చిన్నం బీరప్ప, ప్రచార కార్యదర్శి భూక్య రాజారాం నాయక్ సహాయ కార్యదర్శి ఒగ్గు రవళి రాణా ప్రతాప్ కోశాధికారిగా కాసులు అంజయ్య. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ర ధన్యవాదాలు తెలిపారు సర్పంచుల సమస్యల పరిష్కారాని
ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కీర్తి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సుర్వి మల్లేష్ గౌడ్,రాష్ట్ర సలహాదారులు రవీందర్ యాదవ్,జిల్లాలోని వివిధ మండల ఫోరం అధ్యక్షులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Featured Storys




భువనగిరి, మార్చ్ 27, 2026:
ఈరోజు భువనగిరి విద్యుత్తు డివిజన్ ఆఫీసు ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు 1104, 327, టి ఆర్ వి కె ఎస్, బి సి అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘాలు మద్దతు తెలుపుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, మిగిలిపోయిన అన్మాండ్ కార్మికులు మరియు సొసైటీ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించాలని, పిసు రేటు కార్మికులు ప్రవేట్ కలెక్షన్ ఏజెంట్లు, ప్రైవేట్ మీటర్ రీడర్లు, ఎస్పీఎం కార్మికులు, హమాలీలు కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని అలాగే 2026 పి ఆర్ సి కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిజిఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్ బొక్క పాండరీ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చైర్మన్ భాస్కర్ నాయక్, భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కో చైర్మన్ ఎడ్ల వెంకటేశు, కన్వీనర్ బోట్ల రమేష్,కో కన్వీనర్ హరికృష్ణ,సాగిన రమేష్, భువనగిరి సబ్ డివిజన్, బింగి శ్రీకాంత్ దాతరపు భాస్కర్, వైస్ చైర్మన్ బొట్ల నర్సింగరావు, బండ రవి, కోశాధికారి హేమలత,మహిళ ప్రతినిధి మహేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శి అమరేందర్, ఈదయ్య,బాలకృష్ణ సంయుక్త కార్యదర్శి భాస్కర్, శోభన్ బాబు, మల్లేష్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.
రష్యా యుద్ధం నేపద్యం లో నగరం లో పెట్రోల్ కొరత వల్ల పలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కట్టిన వాహనదారులు