మహిళలకు సాధికారత దిశగా ప్రోత్సాహం

కూకట్పల్లి, మార్చ్ 29, 2026 : కూకట్పల్లి నియోజకవర్గంలో మహిళలకు సాధికారత దిశగా ప్రోత్సాహం అందించేందుకు కూకట్పల్లి ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తన సొంత నిధులతో కుట్టు మిషన్లు అందజేశారు. ఆదివారం ఉదయం ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొంది సర్టిఫికెట్లను అందుకున్న మహిళలకు తన సొంత డబ్బులతో కుట్టు మిషన్లను అందజేశారు. గత నాలుగేళ్లుగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను అందిస్తున్నామని, మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఏమ్మెల్యే మాధవరంకృష్ణారావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మహిళలకు అనేక హామీలను ఇచ్చారని ఉచిత బస్సు మినహా కనీసం ఒక్క హామీకూడా నెరవేర్చలేదని విమర్శించారు. పేదలకు ఉచితంగా అందించే సేవల పట్ల నిర్బంధాలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు పాల్గొన్న, కిందిస్థాయి సిబ్బంది పాల్గొన్న వారిపై ఒత్తిళ్లు ఉన్నాయని ఇలా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందటం కాదు అధోగతి పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత నిలువరించాలని ప్రయత్నించినా తాను ప్రజలకు ఉచితంగా తనదైన శైలిలో చేపట్టే కార్యక్రమాలు మాత్రం ఆపేది లేదని కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించారు. కార్యక్రమలో కార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమన్ శ్రీ మల్లాది, మంజులత మల్లాది తదితరులు పాల్గొన్నారు.

కరాటే డో-బెల్ట్ గ్రేడింగ్ 50 స్టూడెంట్స్ కు బెల్ట్ గ్రేడింగ్ ధృవపత్రాలు పంపిణి చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు

కూకట్పల్లి నియోజకవర్గం లోని బాలాజీనగర్ డివిజన్ గవర్నమెంట్ జెడ్ పి హెచ్ హై స్కూల్ లో ఆదివారం కరాటే డో-బెల్ట్ గ్రేడింగ్ 50 స్టూడెంట్స్ కు బెల్ట్ గ్రేడింగ్ ధృవపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమములో మాజీ కార్పొరేటర్లు పి.బాబు రావు,తూము శ్రావణ్ కుమార్,డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మహిళలకు

  • సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..138 మందిపై కేసులు
  • వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు

టుడే టైమ్స్ న్యూస్, మార్చ్ 29 2026 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి I రంజన్ రతన్ కుమార్ తెలిపారు.ఈ డ్రైవ్‌లో భాగంగా 138 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.121 ద్విచక్ర వాహనదారులు,05 ఆటోలు,11 కార్లు, 01 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —116 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,15 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,07 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు.మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.గత వారం (23.03.2026–28.03.2026) లో మొత్తం 403 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి.వీరిలో00 మందికి జరిమానా, జైలు శిక్ష,00 మందికి జరిమానా, సోషల్‌ సర్వీస్,403 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

టుడే టైమ్స్ న్యూస్, మార్చ్ 29 2026 : టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ సమక్షంలో కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నుంచి కెపిహెచ్బి డివిజన్లో సుమారు 50 మంది మహిళలు స్వాతి రెడ్డి మరియు లక్ష్మి వారి టీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వందలాది మహిళలు కాంగ్రెస్ పార్టీలో ఘనంగా చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి వారిని బండి రమేష్ ఆహ్వానించారు ఈ సందర్బంగ మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు,మహిళల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నమ్మకాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.భవిష్యత్తులో మరింత మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతారని ధీమా వ్యక్తం చేశారు అర్హులైన ప్రతి మహిళల కుటుంబానికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు అందె విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పై ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి,బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, కేపీహెబీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్,సీనియర్ నాయకులు మగ్దమ్ బాయ్,బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య,డివిజన్ అధ్యక్షురాలు రజిత గౌడ్,బండి సుధా,లక్ష్మీ అరవింద,సరోజ,శ్రీధర్ చారి,రామకృష్ణారెడ్డి,గిరి నాయుడు, కొమ్ము బాబు,కళ్యాణ్ బాబు,దుర్గాప్రసాద్,నాగు,మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. .

శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కెపిహెచ్బి డివిజన్ నుంచి సుమారు 50 మంది మహిళలు

టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 29 2026 : 44 వసంతాల వేడుకలు కూకట్పల్లి బాలాజీ నగర్ 250 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు నందమూరి సుహాసిని అక్క యువసేన అధ్యక్షులు హరి సురేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ చింతచెట్టు సెంటర్ తెలుగుదేశం దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ చేసి తదుపరి విజయదుర్గా టిఫన్ సెంటర్ వద్ద కేక్ కటింగ్ నిర్వహించి అన్నదానం మరియు మజ్జిగ పంపిణి చెయ్యడం జరిగినది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు హరి సురేష్ మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు గారి ఆశయ సాధనలో భాగంగా పేదలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నిత్యం తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా ఘనంగా నిర్వహిస్తూ, నిత్యం ప్రజాసేవలో మమేకం అవుతూ పార్టీ భలోపేతనికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను అని కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగినది. రాబోయే ఎటువంటి ఎన్నికలలో అయినా తెలుగుదేశం పార్టీ భరిలో ఉన్న లేకపోయినా పార్టీ యొక్క మార్కును మేయర్ పీటాన్ని ఎంపిక చేసే విషయంలో కీలక పాత్ర పోషించే విధంగా పార్టీని ముందుకు తీసుకుని వెళతాను ఘాటుగా చెప్పడం జరిగినది. అలాగే తెలుగుదేశం పుట్టిందే తెలంగాలో, రాష్ట్ర భవిష్యత్తును మార్చిందే తెలుగుదేశం పార్టీ అని, ఎందరో నాయకులను తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థానాలలో నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అని తెలిపారు. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రజలపార్టీ అని, ప్రజాస్వామ్య పార్టీ అని కొనియాడారు. చివరిగా నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి మన కూకట్ పల్లి నియోజవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న అన్న టైగర్ హరన్న తనయురాలు నందమూరి సుహాసిని గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ మా అందరిని ముందుకు నడిపిస్తు ఎప్పుడు అందుబాటులో ఉంటూ కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ జెండాను రెప రెప లాడేలా చేస్తున్న నందమూరి సుహాసిని గారికి ప్రత్యేక అభినందలు తెలియచేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాచిన సుబ్బారావు గారు, రాములు యాదవ్ గారు, సులేమాన్ గారు, సూరప నాయుడు గారు, ఆంజనేయలు గారు, ఆలం శివ అన్న, మెడికల్ షాప్ నాగేశ్వర రావు గారు, తెలంగాణా ఐ - టిడిపి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ అరూప్, పునాటి కిరణ్, వెంకట్, ఘంటా శ్రీనివాస్ చౌదరి, ప్రవీణ్ తుమ్మల, శివ (బుజ్జి) కార్యకర్తలు, మరియు నారా, నందమూరి అభిమానులు మరియు 250 డివిజన్ వాస్తవ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

జై రామన్ 3D స్టూడియో ప్రారంబించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా,ఘనంగా జరిగింది.సీతారామయ్య గారి ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన 3D ఫోటోగ్రఫీ సేవలు అందించాలని స్టూడియో నిర్వాహకులను కోరారు. కాలనీవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని ఆకాంక్షించారు.ప్రారంభోత్సవ వేడుకలో స్థానికులు, అభిమానులు, పలు ప్రముఖులు పాల్గొనడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.

Contact:

todaytimesnews1@gmail.com

+91 9700597750

© 2026 All rights reserved - todaytimesnews.in

TodayTimesnews.in