Breaking News: Global markets react to new economic reforms
కూకట్పల్లి,ఏప్రిల్ 03 2026 : కూకట్‌పల్లి రామాలయంలో శుక్రవారం నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.ఆలయంలో 108 కలశాలతో అభిషేకం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధిప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.స్థానిక ప్రజలు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కూకట్పల్లి రామాలయం లో కలశాభిషేకం
యేసుక్రీస్తు తన ప్రాణాలను ఒక వర్గం కోసం కాదు సమస్త మానవజాతి కోసం








టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 03 2026 : కూకట్‌పల్లి పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ఓ వృద్ధ మహిళ పరిస్థితి ఆందోళన కలిగించింది. గత 15 రోజులుగా ఆమె తిండి తీసుకోకుండా కేవలం నీటితోనే గడుపుతున్నట్లు నాగరాజు గుర్తించారు.ఆమెతో మాట్లాడినప్పటికీ మతిస్థిమితం సరిగా లేకపోవడంతో స్పష్టంగా వివరాలు తెలియజేయలేకపోయింది.వెంటనే నాగరాజు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి ఫోటోలు పంపించి మిస్సింగ్ కంప్లైంట్ ఉందేమోనని అని విచారణ చేపట్టారు.పోలీసుల సహకారంతో ఆమె కుటుంబ సభ్యుల వివరాలు సేకరించగా శ్రీనివాస్ నగర్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో తన అక్క,బావ ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు.అనంతరం జగన్ కు సమాచారం ఇచ్చి వారి సహకారంతో వృద్దురాలిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు.తదుపరి విచారణలో ఆమె జనగాం సమీపంలోని పాశరమట్ల గ్రామానికి చెందిన మున్నూరు కాపు కుటుంబానికి చెందినవారని తెలిసింది.స్థానికులు, పోలీసులు సమన్వయంతో స్పందించి వృద్ధ మహిళను కుటుంబానికి చేర్చడం పట్ల నాగరాజును అభినందించారు.






టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 03 2026 : శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే సందర్బంగా కూకట్పల్లి ఎన్ కెఎన్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి.వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా.రేవ్.ఇసాక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఆయన ప్రేమ, త్యాగం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం” అని పేర్కొన్నారు.అలాగే సమాజంలో ప్రేమ, ఐక్యత, సేవ భావనలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
15 రోజులుగా ఆలయంలో నిరాహారంగా వృద్ధ మహిళ…




పోలీసులు,నాగరాజు సహకారంతో కుటుంబానికి చేరిక
ఆశీర్వచనం పొందుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు






ఫ్రైడే డ్రై డే
ఆస్ బెస్టాస్ కాలనీ లో
టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 03 2026 : వెంకటేశ్వరా నగర్ డివిజన్లోని ఆస్ బెస్టాస్ కాలనీ లో ఆల్విన్ కాలనీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంటమాలజీ టీం దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఎం. నరేష్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రై డే అనగా ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను పూర్తిగా తొలగించాలి మరియు టెర్రస్ పైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులపై మూతలు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కరపత్రాలు మరియు డోర్ స్టిక్కర్స్ ద్వారా సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఎం. నరేష్, కాలనీ సెక్రటరీ , కాలనీవాసులు మరియు ఏంటోమలజీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.


టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 03 2026 : మియాపూర్ కాల్వరి టెంపుల్‌లో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి.గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలు చేపట్టారు.ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు.ప్రత్యేకంగా క్రీస్తు శిలువ వేయబడిన ఘటనను స్మరించుకుంటూ ప్రార్థనలు బైబిల్ పఠనాలు నిర్వహించగ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఐలయ్య యాదవుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు
టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 03 2026 : మూసాపేట్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు ఐలయ్య యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూసాపేట్ ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఐలయ్య యాదవ్ ని శాలువాతో సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.“సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఐలయ్య యాదవ్ బిజెపి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం మరింత మంది కార్యకర్తలకు ప్రేరణ అని ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ ఆయన్ను దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని రాజేశ్వర రావు అన్నారు.

