Breaking News: Global markets react to new economic reforms
వేసవి లో వర్షం, ఉక్కపోతకు ఉపశమనం!
కూకట్పల్లి, మార్చ్ 28, 2026: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం లో ఎండలు పెరిగి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శ్రీరామ నవమి సీతారాముల వారి కళ్యాణం ముగిసిన సాయంత్రం ఊరేగింపు సమయం లో ఒక్కసారిగా మబ్బులు ఏర్పడి ఉరుములు మెరుపులతో వర్షం కురవడం తో స్వామి వారికి ఆ మేఘనాధుడి ఆశీర్వాదం తో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.కూకట్పల్లి, కాపీహెచ్బి, బాలానగర్, ఐడిపీల్,జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.








శ్రీ నవ భారత్ డిగ్రీ & పీ.జి కళాశాలలొ తేజోత్సవ్ 2K26
టుడే టైమ్స్ న్యూస్ (యాదాద్రి జిల్లా) మార్చ్ 28th,2026: యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ నవభారత్ డిగ్రీ & పీ.జి కళాశాల యొక్క తేజోత్సవ్ కార్యక్రమాన్ని న కళాశాల విద్యార్దులు ఏంఎన్ఆర్ గార్డెన్స్ లొ ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా సీనియర్ విద్యార్దులు జూనియర్స్ కు తమ కళాశాల యొక్క గొప్పతనాన్ని ,చరిత్రను వివరిస్తూ స్వాగతంపలికారు.అలాగే జూనియర్ విద్యార్దులు సీనియర్స్ కు వీడుకోలు పలికారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిదులుగా కళాశాల చైర్మెన్ డా.వి.సుకుమార్ రెడ్డి హాజరై మెరిట్ మార్కులతో పాటుగా నాలెడ్జ్ కూడా ఉన్నట్లైతే ఏదైనా సాధించగలరని విద్యార్థులకు తెలియజేశారు మరియు కళాశాల కరస్పాండెంట్ ఏం.సుభాష్ రెడ్డి విద్యారులు భవిష్యత్ లొ గొప్ప స్థాయి కి చేరాలంటే కష్టం తొ కాకుండా ఇష్టం తొ చదివితే ఉన్నత స్థాయికి వెళ్లి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలను సంపాదించి పెట్టగలరని తెలియజేశారు. డైరెక్టర్ పి.నరసింహ రెడ్డి మాట్లాడుతూ యువత ప్రయత్నిస్తే సాధించనిది అనేది ఉండదు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో శ్రమిస్తే జీవితంలో గొప్ప వ్యక్తులుగా స్థిరపడి వారి తల్లిదండ్రులకు మరియు కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకరగలరని విద్యార్దులకు తెలియజేశారు.మరియు కళాశాల డైరెక్టర్ ఎం.శ్రావణి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెసినా కూచిపుడి,భరత నాట్యాలను కొనియాడారు.తదనంతరం విద్యార్థులు ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎల్లెష్,అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్,అధ్యాపకులు పద్మ, శ్రీధర్,వెంకన్న,సంతోష్, స్పందన,భావిక,ధరణి, శ్రీకాంత్,శ్రవణ్, సునీల్,రఫ్ఫి, ప్రసన్న, మౌనిక, వెంకటేశ్,పరిపూర్ణ, లైబ్రరీయన్ నరేందర్,పూలచంద్,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






అంతర్రాష్ట్ర గృహా చోరీలకు పాల్పడుతున్న నేరస్థుడు ఒకరిని అరెస్ట్ చేసిన కేపీహెచ్ బి పోలీసులు.
పాత నేరస్థుడు సన్ కుమార్ నుంచి 2,80,000 రూపాయల బంగారు ఆభరణాలు స్వాధీనం.
టుడే టైమ్స్ న్యూస్, మార్చ్ 28 2026 : కేపీహెచ్ బి సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులోని చిలుకూరు చెందిన పెడవల్లి సంజయ్ కుమార్ 25 సంవత్సరాల సంజయ్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్ లోని హఫీజ్‌పేట్ లో నివాసం ఉంటున్నాడు.నిందితుడు చోరీ పాల్పడిన దొంగిలించిన సుమారు రూ.2,80,000 విలువ గల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.గతంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కలిపి పది గృహ చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు.కేపీహెచ్‌బీ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నది ఏమనగా ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలు అప్ర


హైదర్ నగర్ డివిజన్ HMT హిల్స్ ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ శ్రీ సీత రామాంజనేయ దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నయనానందకరంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు తన సతీమణితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ నార్నె శ్రీనివాస రావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు డివిజన్ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కాలనీ వాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది.


ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పీఏసి ఛైర్మెన్ అరెకపూడి గాంధీ.
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ పిఏసి చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పిఏసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినదనియం అని ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రోజువారి జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని నివారించేందుకు వైద్య శిబిరం ఎంతగానో తోడ్పడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఇందులో భాగంగా స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది అని జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు ,స్త్రీల వైద్యులు , చిన్న పిల్లల వైద్యులు,ఎముకలకు సంబంధించిన వైద్యులు, చర్మ వైద్యులు, నేత్ర వైద్యులు, దంత వైద్యులు న్యూ రాలజిస్ట్,ENT, వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరిక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం అభినందించారు చైర్మన్ గాంధీ.డాక్టర్లను శాలువతో సన్మానించడం జరిగినది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు,బీపీ,షుగర్,గైనకలజీ,ఆర్థో,ECG,ENT, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్సరే అర్హులైన వారికి ఉచిత కళ్ళజోడులు, ఉచిత మందులు పంపిణీ వంటి మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినది అని ,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనియమని ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు .మానవతా దృక్పతం తో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం అని ,ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పిఏసి చైర్మన్ తెలియజేసారు.ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినదించారు.ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని అంతే కాకుండా సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిఏసి చైర్మన్ గాంధీ సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నాయకులు ,కార్యకర్తలు వైద్య సిబ్బంది,కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.






టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల దేశాల్ జన్మదిన శుభ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు దేశాల్ గారిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, మోజెస్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.గొట్టిముక్కల భాస్కర్ రావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరుమర్తి రాజు,పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు చంద్ర రెడ్డి, విఠల్,మహేష్ గౌడ్, తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర నగర్ లోని రోడ్డు నంబర్ 8,9,10,11 వీధుల్లో మన్ నీటిలో మురుగు నీరు (డ్రైనేజ్) కలిసి రావడం దుర్వాసన వస్తుండటం తో బస్తీ అధ్యక్షులు శ్రీరాముల వెంకట కుమార్ విషయం తెలుసుకొని బస్తీ వాసులతో కలిసి సంబంధిత వాటర్ వర్క్ అధికారి రాజీ రెడ్డి నల్లా లో వచ్చిన నీటిని తీసుకెళ్లి నిరసన తెలియజేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీరాముల వెంకట కుమార్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, రామ్ చందర్,సోమయ్య,రాజేందర్ కార్యవర్గ సభ్యులు సోమేశ్ మురళి శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.




టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : కూకట్పల్లి బిజెపి ఆఫీస్ ముందు రాత్రి మూడు గంటలకు బోల్తా పడిన చెరుకు లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు, ఉదయం ట్రాఫిక్ జాము, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు




రామాలయానికి వెండి దార్వాజాల కోసం 30 కిలోల వెండి సమర్పణ.
గుండాల జగత్రావు జ్ఞాపకార్థం 108 వెండి పూలు శ్రీ సీతారామచంద్స్వామి దేవస్థానం వారికి సమర్పించిన వారి కుమారుడు చక్రధర్ రావు
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : ఎలమంచి రాధాకృష్ణ గారు మరియు ఝాన్సీ భాయ్ దంపతులు భక్తిశ్రద్ధలతో రామాలయానికి వెండి దార్వాజాల నిర్మాణం కోసం 30 కిలోల వెండిని సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు.రామాలయం అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.










టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్), మార్చ్ 28 2026 : కూకట్పల్లి డివిజన్ లోని ఆస్బెస్టాస్ కాలని అధ్యక్షులు నరేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రులు,కాలని ప్రజలు కేకులు కట్ చేయించి భారీ దండలతో ర్యాలీ నిర్వహించి సన్మానించారు.జన్మదినోత్సవం సందర్బంగా వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఉచితంగా వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు.