జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు,అలైవ్ అరైవ్ వాహనదారులకు అవగాహనా కలిగేలా బ్యానర్ల ఏర్పాటు

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడిందని జీడిమెట్ల ఎస్హెచ్ఓ శ్రీ గడ్డం మల్లేష్ తెలిపారు,ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ,ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.ఇక మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబ వ్యవస్థకు మరియు సమాజానికి కలిగే హానికారక ప్రభావాల గురించి వివరంగా తెలియజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది.