కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 17 2026 : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడిందని జీడిమెట్ల ఎస్హెచ్ఓ శ్రీ గడ్డం మల్లేష్ తెలిపారు,ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ,ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు.ఇక మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబ వ్యవస్థకు మరియు సమాజానికి కలిగే హానికారక ప్రభావాల గురించి వివరంగా తెలియజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

 

టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 17 2026 : మేడ్చల్ జాతీయ రహదారి పై పిల్లర్ నంబర్ 03 వద్ద వేగంగా వస్తున్న ts08ue6386 నంబరు గల మినీ ట్రక్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది.స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ .దింతో ఉదయం రద్దీ సమయం కావడం తో కోడి సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి రోడ్డు అడ్డుగా పడిన మినీ ట్రుకక్కును తొలగించారు.వాహనదారులు వేగాన్ని తగ్గించి సమయస్ఫూర్తితో వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుందని పోలీసులు డ్రైవర్ కు సూచించారు.

మేడ్చల్ జాతీయ రహదారి పై మినీ ట్రక్కు బోల్తా

స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్

Contact:

todaytimesnews1@gmail.com

+91 9700597750

© 2026 All rights reserved - todaytimesnews.in

TodayTimesnews.in