కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 13 2026 : అల్విన్ కాలనీ (ప్రస్తుతం ఉమమ్మడి) డివిజన్ లోని ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీ లో గత కొన్ని రోజులుగా రోడ్ల పై డ్రైనేజి పొంగి పారుతున్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరించడం పై స్థానికులు సమస్యను శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం తో అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.నామ మాత్రంగా అధికారులు స్థానిక సమస్యల పై వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప పరిష్కారం చూపడకపోవడం ఏంటని ప్రశ్నించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల దుర్వాసన,దోమల పెరుగుదల,వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని.వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.సమస్యను త్వరగా పరిష్కరించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రైనేజీ వద్దే కూర్చుని ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జగదీష్, ప్రదీప్ రెడ్డి, సాయి, రాజు, లడ్డు, కాలనీ వాసులు, అలాగే అనిల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించండి
సమస్యను పరిష్కరించకపోతే బిఆర్ఎస్ అద్వర్యం లో అక్కడే కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం - అనిల్ రెడ్డి
ప్రజా పాలన ప్రగతి పాలన లో 30వ రోజు డ్రైవ్ " క్లీనింగ్ పార్క్"


టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : కేపిహెచ్బి డివిజన్ లో గల పీవీ నరసింహారావు పార్కులో పిల్లల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులకు సంబంధించి పనులను పరిశీలించారు.పార్క్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు ఆదేశించారు.ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఒకగంట వ్యాయామానికి కేటాయించాలన్నారు.పిల్లలకు క్రీడల పట్ల అవగానే కలిగించి మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని కాపాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు,ఈ కార్యక్రమంలో ఏఈ రాజీవ్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 :ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 30వ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని జీడిమెట్ల సర్కల్ లోని శుభ్రపరచడం మరియు క్లీన్ చేయడం కోసం పార్కులను గుర్తించడం లో భాగంగా డాక్టర్ జి. శ్రీజన, ఐఏఎస్ గారు కమిషనర్ , సైబరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ మీనాక్షి ఎస్టేట్ కాలనీ పార్క్ ను సందర్శించారు.పార్కులో వాల్కర్స్ తో మాట్లాడారు.త్వరలోనే కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తామన్నారు.
పీవీ నరసింహారావు పార్కులో పిల్లల ఆట వస్తువులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు


3,94,000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్
టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : ముఖ్య మంత్రి సహాయ నిధిని కూకట్పల్లి ఇంచార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అందజేశారు.కూకట్పల్లి లోని వివిధ డివిజన్ లకు చెందిన వారికి 3,94,000/- రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బండి రమేష్ కు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గాలి బాలాజీ, పుష్ప రెడ్డి, కొప్పిశెట్టి దినేష్ కుమార్,గంధం రాజు,పులి శివకుమార్ గౌడ్ ,గోపాల్ చౌదరి, రంగమోహన్ ,అక్బర్ ,ప్రసన్నకుమార్, మధు, మహేందర్, కలికోట బాలరాజు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


బాలికల ఆరోగ్యమే – దేశానికి భవిష్యత్తుకు బలమయిన పునాది - కోలన్ హన్మంత్ రెడ్డి
టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆవిష్కరించారు.9 నుంచి 14 ఏళ్ళుగా గర్భాశయం లో ఉన్న హెచ్పివి వాక్సిన్ కేన్సర్ ను నివారించడం బాలికలు ఆరోగ్యామీ దేశ భవిష్యత్తుకు బలమయిన పునాది అని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.


సేవలోనే కాదు, నిజాయితీలోనూ ముందంజలో 108 సిబ్బంది
నమ్మకానికి నిదర్శనం – బాధితుడి నగదు, బంగారం అప్పగింత
టుడే టైమ్స్ న్యూస్, ఏప్రిల్ 04 2026 : నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి శనివారం సుచిత్ర నుండి మేడ్చల్ వెళ్లే దారిలో ప్రయాణిస్తుండగా జీడిమెట్ల విలేజ్ సమీపంలోని గాంధీ స్టాచ్యూ వద్ద తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ ఈ.ఎం.టి (ఈఎంటి)రాజు మరియు పైలట్ నవీన్ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.బాధితుడి వద్ద ఉన్న ఒక బంగారు గొలుసు,వెండి బ్రాస్‌లైట్,రెండు మొబైల్ ఫోన్లు మరియు సుమారు ₹2 లక్షల రూపాయల నగదును అంబులెన్స్ సిబ్బంది భద్రపరిచారు.ఆసుపత్రికి చేరుకున్న తర్వాత బాధితుడి స్నేహితులను పిలిపించి వారి సమక్షంలో ఆ నగదు మరియు వస్తువులను అప్పగించారు.క్లిష్ట సమయంలో ప్రాణాలు కాపాడటమే కాకుండా లక్షల రూపాయల విలువైన వస్తువులను తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్న పైలట్ నవీన్ మరియు ఈఎంటి రాజులను బాధితుడి స్నేహితులు మరియు స్థానికులు అభినందించారు.





