Breaking News: Global markets react to new economic reforms
కూకట్పల్లి లో వడ్డేపల్లి జన్మదిన సంబరాలు
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్) :
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో “Arrive Alive” కార్యక్రమం భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేఎన్‌టీయూ జంక్షన్ వద్ద లా & ఆర్డర్ ఎస్‌హెచ్‌ఓ,ట్రాఫిక్ సిఐ జానయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం,దాని ప్రాముఖ్యత గురించి పోలీసులు వివరించారు.ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు.అదేవిధంగా,అక్కడ తాత్కాలికంగా హెల్మెట్లు అమ్మే స్టాల్‌ను ఏర్పాటు చేసి,హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని ఆపి,చలానా విధించకుండా వారిని అవగాహన కల్పించారు.పోలీసులు సూచనల మేరకు సుమారు 30 మంది అక్కడే హెల్మెట్లు కొనుగోలు చేసి ధరించారు.పోలీసుల ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
కేపీహెచ్‌బీ పోలీసుల “Arrive Alive” కార్యక్రమం – హెల్మెట్‌పై ప్రత్యేక అవగాహన
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్) : కూకట్‌పల్లి నియోజకవర్గంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి 50వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బిజెపి సీనియర్ నాయకులు నాయినేని సూర్యప్రకాష్ రావు , హర్షణ పల్లి సూర్యరావు, మాధవరం కాంతారావు, రవి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని,ప్రజాసేవలో నిత్యం ముందుండే నాయకుడిగా పేరుపొందిన రాజేశ్వరరావు గారికి వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, సంఘసేవకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.













