Breaking News: Global markets react to new economic reforms
కూకట్‌పల్లి పోలీసుల సమయస్ఫూర్తి – ఐడీఎల్ సరస్సులో యువతి ప్రాణ రక్షణ
టుడే టైమ్స్ న్యూస్ (హైదరాబాద్) : కూకట్‌పల్లి పోలీసులు అప్రమత్తంగా స్పందించి ఓ యువతి ప్రాణాన్ని కాపాడారు. రియా (20), డిప్లొమా విద్యార్థిని, ప్రస్తుతం కేపీహెచ్‌బీ ప్రాంతంలోని షణ్ముఖ్ హాస్టల్‌లో నివసిస్తూ, స్వస్థలం కల్వకుర్తి. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడే ఉద్దేశంతో ఐడీఎల్ సరస్సు వద్దకు వెళ్లింది.ఉదయం 11:55 గంటలకు డయల్-100 ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆలస్యం చేయకుండా ఘటనాస్థలికి చేరుకున్నారు.ఎస్‌ఐ చంద్రశేఖర్,ఎస్‌ఐ దీక్షిత,పెట్రోల్ కార్ డ్రైవర్ హెచ్‌జీ-11:30 వెంకటప్ప తక్షణమే స్పందించి యువతిని గుర్తించారు.అప్పటికే ఆమె సరస్సు మధ్యలో ఉండగా,పోలీసులు సమయస్ఫూర్తితో సరస్సులోకి దిగి ధైర్యసాహసాలతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అనంతరం యువతికి కౌన్సెలింగ్ నిర్వహించి సురక్షిత ప్రదేశానికి తరలించారు.ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు మరోసారి ప్రజల ప్రాణ రక్షణలో తమ నిబద్ధత వేగవంతమైన స్పందన మానవతా దృక్పథాన్ని చాటిచెప్పారు.


